రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న. 9 నెలల తర్వాత బూస్టర్ డోస్‌కి. . . . . అర్హులు.
బూస్టర్ డోస్‌కి మీరు అర్హులైతే ✅….. ప్రభుత్వం నుంచి 📱మీ సెల్‌ఫోన్‌కి మెస్సేజ్ 📲వస్తుంది.
ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు , 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందుగా బూస్టర్ డోస్ ఇస్తారు.
ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా ఇస్తారు.
మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు. మీ వివరాలు ఇదివరకే కోవిన్‌లో ఉంటాయి.
మీరు బూస్టర్ డోస్‌కి అర్హులో కాదో నిర్ణయిస్తారు.
మీ సెల్‌ఫోన్‌కి మెస్సేజ్ పంపుతారు. అప్పుడు మీరు కోవిన్ ద్వారా బూస్టర్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
కరోనావైరస్‌కి వ్యతిరేకంగా తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల తర్వాత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతన్నారు. అందువల్ల బూస్టర్ డోస్ ఇస్తున్నారు.

స్పందించండి