రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సీఎస్ పేర్కొన్నారు.
అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షిస్తాయని సిఎస్ చెప్పారు.
తొలి వి.డత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించివైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్ ఆదిత్యానాధ్ దాస్
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.
Covid-19 Vaccine: రాష్ట్రానికి చేరుకున్న కారోనా వ్యాక్సిన్లు…అసలు సిసలు పండుగ శోభ

స్పందించండి