జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
“50 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుంది” అని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. మొన్న సుప్రీం కోర్టులో కూడా “మరో 15 రోజుల్లో కరెన్సీ పరిస్దితి పూర్తిగా మెరుగు పడుతుంది” అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కానీ అదే రోహత్గి మరుసటి రోజే మాట మార్చేశారు.
“70 రోజుల వరకు ప్రజలు సహనం పాటించాలి. అసౌకర్యాన్ని భరించాలి. ఎందుకంటే 70 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం నల్ల ధనం, అవినీతిలపై ‘విప్లవం’ ప్రకటించింది. ప్రజలు 70 రోజులైనా ఓపిక పట్టాలి” అని రోహత్గి కోర్టు వేదికగా జనానికి గీతోపదేశం చేసారు.
దీనెమ్మ సహనం! సహనం అంటే, ముఖ్యంగా ప్రజల సహనం అంటే ఎంత లోకువ అయిపొయింది?! ఎంత చీప్ అయిపోయింది?! ప్రతి తలకు మాసిన వెధవా జనం సహనానికి రూల్స్ విధించేవాడే! సహనానికే గనక మాటలు వస్తే, సహనానికే గనక చేతలు వస్తే ఈ పాటికి ఈ వెధవల్ని అందరిని ఉప్పు పాతరేసి ఉండేది.
జనం సహనాన్ని బలి కోరేముందు తమకు సహనం ఉందో లేదో ప్రధాని, మంత్రులు, సలహాదారులు మొదట పరీక్షించుకోవాలి. ఎంత సహనం ఉంటె హడావుడిగా, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా 86 శాతం నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసేసారు? ప్రముఖ ఆర్ధిక వేత్త అరుణ్ చెప్పినట్లు మానవ దేహానికి రక్తం ఎలాంటిదో ఆర్ధిక వ్యవస్ధకు కరెన్సీ అలాంటిది…
అసలు టపాను చూడండి 604 more words
స్పందించండి