The Elephant Whisperers

అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డును గెలిచి బోణీ చేసింది.
ఈ డాక్యుమెంటరీ సహ నిర్మాత గునీత్ మోంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తాను ఇప్పటికీ ఆనందంతో వణికిపోతూనే ఉన్నానని చెప్పారు.
మేము భారత చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటి ఆస్కార్‌ను గెలుచుకున్నాము. ఇద్దరు మహిళలు (తను, దర్శకురాలు కార్తి కి) ఈ ఘనత సాధించారు.
ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ ప్రొడక్షన్ హౌజ్ గా సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్ర సృష్టించింది.
ఈ క్షణంలో ఆనందం, ప్రేమ, ఉత్సాహంతో నా గుండె పరుగెత్తుతోంది.
🎯 కార్తికి (డైరెక్టర్)కి థ్యాంక్స్. ఆమెకు అద్భుతమైన దూరదృష్టి ఉంది.
ఇక, నెట్‌ఫ్లిక్స్ మాకు ప్రపంచంలోనే అతిపెద్ద వేదికను అందించింది.
మాపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చింది.
స్పందించండి