అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం ‘న్యూ షెపర్డ్’ రాకెట్‌లో రోదసి యాత్ర పూర్తి చేసుకుని భూమికి చేరుకుంది.
మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు ‘న్యూ షెపర్డ్’ రాకెట్ నింగిలోకి ఎగిరింది.
కర్మన్ లైన్ దాటి వెళ్లడంతో రోదసిలోకి వెళ్లినట్లయింది. సుమారు 11 నిమిషాలలో యాత్ర పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు.
తొలుత రాకెట్ భూమికి చేరుకోగా అనంతరం కొద్ది నిమిషాలకు జెఫ్ బెజోస్ బృందం ఉన్న క్యాప్యూల్ సురక్షితంగా భూమిని తాకింది.
స్పందించండి