ఓం నమో భగవతే రుద్రాయ; రుద్రాయ, రుద్రాయ…….వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,
విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణవచనం.
మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంత్రరాజమే… నమఃశివాయ.
స్పందించండి