వ్యవసాయ భూములన్నీ ఎత్తు ప్రదేశాల్లో ఉంటే, ఇళ్లన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. కొబ్బరి, జీడిమామిడి, మామిడి పంటలకు వినియోగిస్తున్న రసాయనాలు నేరుగా లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల బోరు బావుల్లోకి చేరుతున్నాయి. ఆ నీటిని వంటకు, తాగడానికి ప్రజలు వాడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడానికి ఇదే మూలం” అనేది మనోజ్ విశ్లేషణ.
జియోగ్రాఫికల్ మ్యాప్స్‌కి అభివృద్ది రూపమే కాంటూర్ మ్యాప్స్. ఒక ప్రాంతానికి సంబంధించిన ఎత్తు, పల్లం, ఇతర వివరాల సమగ్ర సమాచారం ఈ మ్యాప్‌లు అందిస్తాయి.ఈ కిడ్నీ సమస్యను అధిగమించాలంటే బయట ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం ఒకటే మార్గమని ‘ఉద్దానం ఫౌండేషన్’ ప్రతినిది డా. పూడి రామారావు అంటున్నారు.

స్పందించండి