via పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్
ఓ క్యారట్ ను ఎరగా వేసి నల్ల డబ్బు వెలికి తీస్తున్నట్లు చెబుతున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఆంగ్లంలో క్యారట్ అండ్ స్టిక్స్ అని ఒక సామెత ఉంది. క్యారట్ అంటే ఒక ఆశ చూపి ప్రయోజనం సాధించడం కాగా స్టిక్స్ అంటే శిక్ష వేయడం ద్వారా ప్రయోజనం సాధించడం. ఈ కార్టూన్ లో పాత నోట్లపై ఆర్.బి.ఐ ఇచ్చిన ఆదేశాన్ని స్టిక్ గా కార్టూనిస్టు పోల్చారు. లెక్కలో లేని డబ్బును తన వీపు కింద భద్రంగా దాచుకున్న తాబేలు క్యారట్ కోసం డబ్బు బైటికి తెస్తుందని ఆర్.బి.ఐ/ప్రభుత్వం భ్రమిస్తున్నట్లుగా కార్టూన్ సూచిస్తోంది.
లెక్కకు రాని డబ్బు బైటికి రావాలంటే తాబేలు వీపుకు కర్ర కట్టడం కాదు, ఆ కర్రతో దాని వీపు బద్దలు కొట్టాల్సిందే అని కార్టూనిస్టు చెప్పదలిచినట్లు కనిపిస్తోంది. క్యారట్ కోసం తాబేలు ఎంత దూరం ‘తాబేలు నడక’ నడిచినా ఆ డబ్బు అటూ ఇటూ తిరుగుతుందే గాని బైటికి రాదని కూడా కార్టూనిస్టు సూచిస్తున్నారు.
స్పందించండి