ట్రంప్ ఫ్యాక్టర్: 3 లక్షల ఇండియన్లు ఇంటికి?


జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

img_0571

భారత దేశం భయపడినదంతా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లోనే హెచ్1 బి వీసాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ నివాసులను త్వరలో ఇంటికి పంపే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు కొట్టివేసిన ముస్లిం వలసల నిషేధం డిక్రీని మళ్ళీ మరో రూపంలో జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్ధితుల్లోనూ తాను చెప్పింది చేసి తీరే వైఖరితో అమెరికన్ భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. 

ప్రస్తుతానికి హెచ్1 బి వీసా హోల్డర్ల అమెరికా నివాసానికి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ సమీప భవిష్యత్తులో వారిపై కూడా దృష్టి సారించవచ్చని కనీసం కొంతమందిని అయినా వెనక్కి పంపేసే నిర్ణయాలు చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 11 మిలియన్ల మందిని అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకు తగిన మార్గదర్శక సూత్రాలను అధ్యక్షుడు ఇప్పటికే జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

“దేశం నుండి పంపివేసి ప్రక్రియ నుండి దేశం నుండి (చట్ట ప్రకారం) తొలగించదగిన కాందిశీకులలోని ఏ తరగతికి లేదా వర్గాలకు చెందినవారికైనా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇక ఎంత మాత్రం మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించింది” అని ఇటీవల జారీ చేసిన ఒక మెమో లో తెలియజేసింది. ఇన్నాళ్లూ కొన్ని వర్గాలకు మానవతా కారణాలతోనూ, కొన్ని…

అసలు టపాను చూడండి 385 more words

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.