జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
రమేష్:
శేఖర్ గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా చదువుతుంటాను. మీ విశ్లేషణలు చాల బావుంటాయి.
సర్, నాకు ఒక సంధేహము. ఏమిటంటే నేను గత 2, 3 సంవత్సరాలుగ అంతర్జాతీయంగా బిట్ కాయిన్ అనే కరెన్సి గురించి విన్నాను. కాని దాని గురించి గాని, అది ఏ దేశ కరెన్సి అని గాని తెలియదు . దయచేసి ఆ కరెన్సి గురించి, అది ఎలా మనకు ఉపయోగపడుతుంది, దానిని ఎక్కడ, ఎలా మార్చుకొవాలి? మెదలగు పూర్తి సమాచారాన్ని తెలుపగలరు.
సమాధానం:
పూర్తి సమాచారం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. నాకు తెలిసినంతవరకు ఒక ఐడియా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
బిట్ కాయిన్ అనేది ఈ దేశానికి చెందిన కరెన్సీ కాదు. ఏ దేశ చట్టాలు, ప్రభుత్వాల హామీలు దానికి లేవు. ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. బిట్ కాయిన్ కు అలాంటి పూచీ యేమీ లేదు.
బిట్ కాయిన్ వర్చువల్ కరెన్సీ మాత్రమే. అనగా ఇంటర్నెట్ లో ఉపయోగించే కరెన్సీ మాత్రమే. నిజ ప్రపంచంలో వాస్తవ చెల్లింపులకు బిట్ కాయిన్స్ ఉపయోగించాలంటే మళ్ళీ వాటిని నిజ కరెన్సీగా మార్చుకుంటే గాని చెల్లవు.
బిట్ కాయిన్ ను డిజిటల్ కరెన్సీగా చెప్పవచ్చు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే నిర్మించబడి ఉంటుంది కదా! అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు…
అసలు టపాను చూడండి 683 more words
స్పందించండి