జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
జి అమర్ నాధ్:
ఈ మధ్య ‘స్టార్టప్ కంపెనీ’ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. కాస్త ఐడియా ఉన్నట్లు అనిపిస్తున్నా పత్రికల్లో కనిపిస్తున్న పదాలు (ఉదా: ఇంక్యుబేటర్) కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కాస్త వివరించి చెప్పగలరా?
సమాధానం:
సరైన సమయంలో వేసిన ప్రశ్న. గత సంవత్సరం ఆగస్టు 15 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పేరుతో ఓ పధకాన్ని ‘మన్ కీ బాత్’ రేడియా ప్రసంగంలో ప్రకటించారు.
పధకం అయితే ప్రకటించారు గానీ అందుకు తలపెట్టిన విధివిధానాలు ఏమిటో ప్రకటించలేదు. జనవరి 16, 2016 తేదీన ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పధకం పూర్తి వివరాలు (స్టార్టప్ నిర్వచనం, మద్దతు చర్యలు, పాలనా నిర్మాణాలు వగైరా) వెల్లడి చేస్తామని ఆరోజు ప్రధాని చెప్పారు.
ఈ సమాధానం రాస్తుండగానే ప్రధాని తన పధకం వివరాలు వెల్లడిస్తున్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే అవి ఇంకా ప్రసంగం దశలోనే ఉన్నాయి. పధకం వివరాల కోసం ఒక అప్లికేషన్ (యాప్) ను రూపొందిస్తున్నామని అది త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రధాని చెబుతున్నారు.
ఇప్పుడు మీ ప్రశ్న విషయానికి వస్తే…
పేరే చెబుతున్నట్లుగా స్టార్టప్ అన్నది ఒక కంపెనీ పెట్టాలన్న ఐడియా ప్రారంభ దశలో ఉన్నట్లు సూచిస్తుంది. ఐడియా అంటే కేవలం ‘ఒక కంపెనీ పెడదాం’ అని మాత్రమే కాదు. దానికి సాధ్యత ఉండాలి. సరికొత్తగా ఉండాలి. క్లిక్ అవుతుంది అనిపించాలి…
అసలు టపాను చూడండి 1,550 more words
స్పందించండి